Breaking News

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

Published on Sat, 05/25/2024 - 03:45

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో బెయిల్‌ కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ విచారించారు. కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌చౌదరి వాదనలు వినిపిస్తూ కవితను అరెస్టు చేసే క్రమంలో పలు ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, చట్టాలు అనుసరించి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

కేసు నమోదు చేసిన తొలినాళ్లలో కవిత పేరు లేదని అప్రూవర్లుగా మారిన వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఆమెను అరెస్టు చేశారన్నారు. అభిõÙక్‌ బోయినపల్లి, విజయ్‌నాయర్‌లకు బెయిలు వచి్చన విషయాన్ని విక్రమ్‌చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కేసులో కౌంటర్‌ దాఖలు చేసినట్టు న్యాయవాది జొహెబ్‌ హొస్సేన్‌ తెలిపారు. తమ కౌంటర్‌ ఈ నెల 27లోగా దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొనగా, ఆదివారం రాత్రి పది గంటలలోపు దాఖలు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. వీలైనంత వరకూ శనివారమే దాఖలు చేయడానికి యత్నిస్తామని సీబీఐ తరఫు న్యాయ వాది కోర్టుకు తెలిపారు, అనంతరం, సోమవారం కవిత తరఫు వాదనలు పూర్తి చేయాలని, మంగళవారం దర్యాప్తు సంస్థల వాదనలు వింటామని జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ విచారణ వాయిదా వేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)