Breaking News

పిల్లలకు పని చెప్పి హాయిగా కునుకు తీసిన హెడ్ మాస్టర్.. 

Published on Sat, 07/15/2023 - 16:00

భోపాల్: బాధ్యతగల ఉపాధ్యాయ వృత్తిలో ఉండి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి బడి ఆవరణను శుభ్రం చేయమని పిల్లలకు  చెప్పి తాను మాత్రం స్కూలు బ్యాగ్ ను తలదిండుగా చేసుకుని కునుకు తీశాడో ప్రధానోపాధ్యాయుడు.   

మధ్యప్రదేశ్ చత్తార్ పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆదమరచి నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లవకుశ నగర్ ప్రాధమిక పాఠశాలలో రాజేష్ కుమార్ అడ్జారియా హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో బయట ఆవరణ శుభ్రం చేయమని చెప్పి వారి చేతికి చీపుర్లు ఇచ్చాడు. ఈ విరామంలో ప్రధానోపాధ్యాయుడు పిల్లల స్కూలు బ్యాగులను తలకింద దిండుగా పెట్టుకుని ఎంచక్కా సేదదీరాడు.

ఆడపిల్లలు స్కూలు మొత్తాన్ని శుభ్రం చేస్తుండగా మగపిల్లలు మాత్రం ఆడుకంటూ ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి చోద్యం మొత్తాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో ఒక చరవాణి నుండి మరోదానికి చేతులు మారుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లల బంధువుల చేతికి చేరింది. 

ఇంకేముంది వారు పిల్లల తల్లిదండ్రులకి విషయాన్ని తెలియజేశారు. బాగుపడుతుందనుకున్న తమ బిడ్డల జీవితం ఇలాంటి అధ్యాపకుల చేతిలో పడితే అంతే సంగతులని భావించి తలిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు. 

ఇది కూడా చదవండి: మంత్రి ఆకస్మిక తనిఖీ.. ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)