Breaking News

తల మసాజ్‌ వల్ల పక్షవాతం

Published on Mon, 09/30/2024 - 08:37

బనశంకరి: కటింగ్‌ షాపులో తల మసాజ్‌ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్‌ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్‌కీపింగ్‌ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్‌ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్‌ చేస్తానంటే సరే అన్నాడు. 

ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్‌ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్‌ సమీపంలోని కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు.

 వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)