Breaking News

‘లొంగిపో.. లేదంటే’.. ప్రజ్వల్‌కు మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్‌

Published on Thu, 05/23/2024 - 18:06

బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన తన మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు మాజీ ప్రధాని దేవెగౌడ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రజ్వల్‌ ఎక్కడ ఉన్నా వెంటనే  భారత్‌కు వచ్చి పోలీసులకు లొంగి పోవాలన్నారు. లేకపోతే తన ఆగ్రహానికి  గురికావాల్సి వస్తుందని దేవెగౌడ తీవ్రంగా హెచ్చరించారు.  ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో ఓ లేఖ విడుదల చేశారు.

‘‘ప్రజ్వల్‌ రేవణ్ణ  ఎక్కడ ఉన్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలి. పోలీసులకు లొంగిపోయి న్యాయ ప్రక్రియను ఎదుర్కొవాలి. ఇది విజ్ఞప్తి చేయటం కాదు. హెచ్చరిక జారీ చేస్తున్నా.  ప్రజ్వల్ నా హెచ్చరికను లెక్క చేయకపోతే.. నా ఆగ్రహానికి, కుటుంబ సభ్యులు కోపానికి గురికావాల్సి వస్తుంది.  

ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసుకుంటుంది. కానీ కుటుంబం చెప్పిన మాట వినకపోతే ఒంటరిగా మిగిలిపోయేలా చేస్తుంది. నాపైన అతనికి గౌరవం ఉంటే వెంటనే భారత్‌కు తిరిగి రావాలి’’ అని దేవెగౌడ తాను విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

 

ప్రజ్వల్‌ రేవణ్ణపై నమోదైన లైంగిక దాడి కేసు, ఆయనకు సంబంధించిన అసభ్య వీడియోలై దర్యాప్తు చేయడానికి కర్ణాటక ప్రభుత్వం సిట్‌  ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సీఎం సిద్ధరామయ్య ప్రజ్వల్‌ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్టును  రద్దు చేయాలని  ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)