Breaking News

తోడబుట్టిన బలగం

Published on Fri, 06/20/2025 - 03:14

‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్‌. ఇంట్లో టీవీ రిమోట్‌ కోసం ఫైటింగ్‌జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్‌ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! 

కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే,  కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. 

తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.

మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. 

వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. 

బ్రిటన్‌కు చెందిన ‘ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్‌ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.

మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. 

సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ జర్నల్‌’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. 

తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్‌ సపోర్ట్‌ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్‌లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. 

ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.

తోబుట్టువులు ఉంటే చాలు..
» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ  (బ్రిగమ్‌ యంగ్‌ యూనివర్సిటీ)
» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయ్‌)
» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ  (సైకలాజికల్‌ సైన్స్‌) 

తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్‌ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.

– సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)