Breaking News

హత్రాస్‌ ఘటన: లొంగిపోయిన ప్రధాన నిందితుడు

Published on Sat, 07/06/2024 - 06:53

యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మధుకర్‌ను యూపీ పోలీసులకు అప్పగించినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

రాజస్థాన్, హర్యానాతో పాటు యూపీలో మధుకర్ కోసం హత్రాస్ పోలీసులు వెదుకులాట సాగించారు. మధుకర్‌ లొంగిపోయిన తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో చీఫ్ సేవాధర్ మధుకర్ మాత్రమే నిందితునిగా ఉన్నాడు. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. మధుకర్ ఢిల్లీలో వైద్య చికిత్స పొందుతున్నాడని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. మధుకర్‌పై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆగ్రా జోన్‌ ఏడీజీ అనుపమ్‌ కులశ్రేష్ట్‌ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసుపై సిట్‌ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నారాయణ్ సాకార్‌ విశ్వ హరి అలియాస్ భోలే బాబా ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో భోలే బాబా పేరు లేదు. కాగా దర్యాప్తునకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ హత్రాస్‌కు చేరుకుంది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)