Breaking News

హత్రాస్‌ ఘటనపై 850 పేజీల సిట్‌ రిపోర్టు

Published on Tue, 07/09/2024 - 12:35

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ తొక్కిసలాట కేసులో సిట్ నివేదిక వెలువడింది. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సిట్‌ ఈ కేసుపై విచారణ జరిపింది. తాజాగా సిట్‌ ఈ నివేదికను హోం శాఖకు అందజేసింది. బాధ్యులందరి పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి.

ఈ కేసులో 128 మందితో జరిపిన సంభాషణల ఆధారంగా సిట్‌ అధికారులు ఈ నివేదికను రూపొందించారు. ఇందులో సత్సంగంలో ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి ఎవరు కారకులనేది వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నివేదిక గోప్యంగా  ఉంచారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు సీఎం ఆదేశించనున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్‌ ఈ నివేదికపై సీనియర్ అధికారులతో చర్చించనున్నారు.  ఏడీజీ ఏడీజీ అనుపమ కులశ్రేష్ఠ, అలీగఢ్‌ డివిజనల్‌ కమిషనర్‌ చైత్ర వి ఈ నివేదికను రూపొందించారు. సిట్ రూపొందించిన ఈ నివేదిక 850 పేజీలు ఉన్నట్లు సమాచారం.

ఇటీవల హత్రాస్‌లో బాబా సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ  ఘటనలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా పాదాలను పూజించేందుకు భక్తులు ఒక చోట గుమిగూడిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.

మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధం కలిగినవారిని అరెస్టు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరు లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఘటనాస్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి