జీ రామ్‌ జీ కోసం రూ.3,825.31 కోట్లు

Published on Fri, 06/12/2026 - 03:12

సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వికసిత్‌ భారత్‌–గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ స్కీమ్‌ (గ్రామీణ్‌) (వీబీ జీ రామ్‌జీ) పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.

గురువారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో భేటీ అయి పథకం అమలు, రాష్ట్రానికి అందాల్సిన సహకారం తదితర విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్‌ 9 నాటికి ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు.

60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఖర్చు చేయనున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉందని, దీంతోపాటే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను కూడా కేటాయించాల్సి ఉందని కిషన్‌రెడ్డి తెలియజేశారు. వ్యవసాయ పనుల విరామానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా వ్యవసాయదారులందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందన్నారు. జీ రామ్‌ జీ పథకాన్ని రాష్ట్రంలో అనుకున్న సమయానికి సజావుగా, సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సమీక్షలు జరుపుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

#

Tags : 1

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)