Breaking News

(వీడియో): బాయ్స్‌ హస్టల్‌కు లవర్‌ను తీసుకెళ్లే ప్లాన్‌.. ప్రియుడు ఏం చేశాడంటే?

Published on Sat, 04/12/2025 - 12:16

ఛండీగఢ్‌: ప్రస్తుత జనరేషన్‌లో యువత ప్రేమ పేరుతో రచ్చ చేస్తున్నారు. భయం, సిగ్గు లేకుండా పబ్లిక్‌గానే హద్దులు దాటుతున్నారు. ఇక, తాజాగా ఓ ప్రేమికుడు.. తన ప్రియురాలి కోసం పెద్ద సాహసమే చేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌ రూమ్‌లోకి తీసుకెళ్లేందుకు కొత్త ​ప్లాన్‌ చేశాడు. ఓ సూటు కేసులో ఆమెను దాచిపెట్టి తన రూమ్‌కి తీసుకువెళ్దామనుకున్నాడు. ఇంతలో సెక్యూరిటీకి ొదొరికిపో​ాయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. వీరి మధ్య ప్రేమ ముదిరిపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్‌ను విడిచి ఉండలేక ఆమెను తనతో పాటు హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. దీంతో, ఆమెను ఓ పెద్ద సూట్ కేసులోప్యాక్ చేశాడు. సూట్ కేసులో ఆమెను తీసుకెళ్తూ హాస్టల్ లోకి ప్రవేశించాడు. అయితే, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి లగేజ్ సూట్ కేసును చెక్ చేశారు.

ఇంకేముంది.. ఆ సూట్‌కేస్‌ను తెర‌వ‌గానే లోప‌ల‌ అమ్మాయి కనిపించ‌డంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వెంట‌నే సూట్‌కేస్‌లో నుంచి ఆ అమ్మాయిని బ‌య‌ట‌కు తీశారు. హస్టల్‌లో తోటి విద్యార్థులు ఈ ఘటన‌ను వీడియో తీశారు. ఆ త‌ర్వాత వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యూనివర్సిటీ యాజమాన్యం వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వయసు ప్రభావం ఎంతటి తప్పునైనా చేయిస్తుందని కొందరు.. ఇదేమి ప్రేమ పైత్యంరా బాబు అని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)