Breaking News

Video: త‌ప్ప తాగి కారుతో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన డ్రైవ‌ర్‌

Published on Sat, 06/22/2024 - 16:59

హ‌ర్యానాలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసును కొంత‌మంది బ‌ల‌వంతంగా కారులోకి ఎక్కించుకొని ఈడ్చుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఫరీదాబాద్‌లోని బల్లాబ్‌ఘర్‌లో న‌డిరోడ్డుపై జ‌రిగింది.

బల్లాబ్‌ఘర్ బ‌స్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు.  ఓ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో  రోడ్డు మ‌ధ్య‌లో కారును ఆపి ట్రాఫిక్ అంత‌రాయం క‌లిగించ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు వెళ్లారు. ట్రాఫిక్ స‌బ్‌- ఇన్‌స్పెక్ట‌ర్ డ్రైవ‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి బండి ప‌త్రాలు అడిగి, చలాన్ రాసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ విష‌యంపై డ్రైవ‌ర్‌కు పోలీస్‌కు మ‌ధ్య వాగ్వాదం మొద‌లైంది.

పేపర్‌లను పరిశీలించేందుకు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ డ్రైవర్‌ డోర్ ద్వారా కారు లోపలికి వంగగా.. డ్రైవర్‌ ఒక్కసారిగా యాక్సిలరేటర్‌ను నొక్కి కారును ముందుకు పోనిచ్చాడు. ట్రాఫిక్ పోలీస్‌తోపాటు కారు అలాగే ముందుకు కొన్ని మీట‌ర్ల వ‌ర‌కు ఈడ్చుకెళ్లింది. అక్క‌డున్న వారు, ఇతర ట్రాఫిక్ సిబ్బంది వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు.

నిందితుడుని కొంత‌దూరం వెంబ‌డించి ప‌ట్టుకున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)