Breaking News

హరియాణాలో విడాకుల సంబరం

Published on Thu, 12/12/2024 - 09:53

చండీగఢ్‌:  ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్‌ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్‌ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్‌ కట్‌ చేశాడు. డైవోర్స్‌ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. 

ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. 

ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్‌ 2020లో కోమల్‌ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్‌ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్‌ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.    

 

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు