Breaking News

Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యే

Published on Sat, 10/05/2024 - 13:21

చండీగఢ్‌: హర్యానాలో ఈరోజు (శనివారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల చెదురుమదురు హింసాత్మక సంఘటనలు  చోటుచేసుకున్నాయి. మెహమ్ నుంచి పోటీ చేస్తున్న హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి  బాల్‌రాజ్‌ కుందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనపై దాడి చేసి, తన బట్టలు చించేశారని ఆరోపించారు. దీనిపై వీడియో సందేశం ద్వారా ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

జన్ సేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్‌ కుందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను, తన పీఏ రోహ్‌తక్ జిల్లాలోని ఒక బూత్‌కు వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే డాంగి దాడిచేశారని, తన దుస్తులను చింపేశారని కూడా ఆరోపించారు.

కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి ఓడిపోతారనే భయంతోనే అతని తండ్రి ఆనంద్ సింగ్ డాంగి ఈ దాడికి పాల్పడ్డారని బాల్‌రాజ్‌ కుందు ఆరోపించారు. హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్‌రాజ్‌ కుందు మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆనంద్ సింగ్ డాంగి కుమారుడు బలరామ్ డాంగి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున దీపక్ హుడా పోటీ చేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. 

ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్‌ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)