వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Lockdown: భారీ సడలింపులతో పొడిగించిన మరో రాష్ట్రం
Published on Mon, 06/07/2021 - 08:36
చండీఘడ్: దేశంలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గినప్పటికి ఈ మహమ్మారి వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించడానికే మొగ్గుచూపుతున్నాయి. తాజాగా, హర్యానా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అయితే, కొంత వరకు నిబంధలను మాత్రం సడలించినట్లు హర్యానా రాష్ట్ర కార్యదర్శి విజయ్ వర్ధన్ వెల్లడించారు.
- కార్పొరేట్ ఆఫీసులలో 50 శాతం ఉద్యోగులు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హజరవ్వాడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలను సరి, బేసి విధానాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరచి ఉంచుకోవడానికి వెసులు బాటు కల్పించారు.
- షాపింగ్ మాల్స్‌ను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. ఇక, బార్లు, హోటల్లు, రెస్టారెంట్, క్లబ్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు తెరచి ఉంచుకోవచ్చని తెలిపారు. వీటిలో కూడా 50 శాతంమేర ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు.
- ప్రార్థన మందిరాలలో ఏసమయంలో అయినా.. 21 మందికి మించి ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వివాహ వేడుకలలో 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బరాత్‌లకు, ఊరేగింపులు, ఇతర సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
- అదేవిధంగా.. అంతిమ సంస్కారాలకు కూడా కేవలం 21 మందిలోపు మాత్రమే హజరవ్వాలని సూచించారు. అయితే, గత నెలలో హర్యానా రాష్ట్రం లో ప్రతిరోజు 15,000 వేల కరోనా కేసులు నమోదవుతుండగా, ప్రస్తుతం ఆసంఖ్య 9,974 కు తగ్గినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
చదవండి: కారులో ఎలుగుబంటి.. ప్రాణాలు కాపాడిన కుక్క!
#
Tags : 1