Breaking News

విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ

Published on Thu, 03/14/2024 - 06:37

చండీగఢ్‌: ఖట్టర్‌ రాజీనామాతో హరియాణా సీఎం కుర్చీపై కూర్చున్న నాయబ్‌ సింగ్‌ సైనీ బుధవారం అసెంబ్లీ చేపట్టిన విశ్వాస పరీక్షలో గెలిచారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనే స్వయంగా విశ్వాస పరీక్షకు గవర్నర్‌ను అభ్యరి్ధంచి శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగేలా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక సంకీర్ణ ప్రభుత్వం నుంచి జననాయక్‌ జనతాపారీ్ట(జేజేపీ) వైదొలగడం, సీఎంగా ఖట్టర్‌ రాజీనామా చేయడం, నూతన సీఎంగా సైనీ ప్రమాణం చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షలో పాల్గొనకుండా 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేజేపీ విప్‌ జారీచేసింది.

అయినాసరే ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ తీరా బలపరీక్షపై ఓటింగ్‌ జరిగే సమయానికి బయటకు వెళ్లిపోయారు. విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. రెండుగంటల చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్‌ను స్పీకర్‌ అనుమతించారు. మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గింది. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది సొంత ఎమ్మెల్యేల బలముంది. మరో ఏడుగురు మద్దతు పలికారు. బుధవారం 12 మంది సభకు రాకపోవడంతో సభలో సభ్యుల సంఖ్య 78కి, మెజారిటీ మార్కు 40కి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్‌ బలపరీక్షలో నెగ్గడం లాంఛనమైంది. 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)