Breaking News

‘ ఒంటరి’ ఉద్యోగుల అసంతృప్తి.. నౌకరీ నచ్చలే

Published on Thu, 04/06/2023 - 05:09

టీమ్స్‌తో కాకుండా.. ఒంటరిగా పనిచేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువ అసంతృప్తితో ఉంటున్నారట. ‘అన్‌హ్యాపీ­య్యెస్ట్‌ జాబ్స్‌’పై హార్వర్డ్‌ యూని­వర్సిటీ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. విధి నిర్వహ ణలో సంతృప్తి పొందే విషయంలో మంచి జీతం, గౌరవం, విశ్వాసం, భద్రత, మంచి కెరీర్, ఇతర ప్రయోజ నాలు వంటివి కీలకపాత్ర పోషిస్తున్నట్టు గతంలోనే పలు అధ్యయనాలు స్పష్టంచేశాయి.

అయితే దీనికి భిన్నంగా వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించే అంశా లేంటి, వాటికి కారణాలేంటి అనే దానిపై హార్వర్డ్‌ వర్సిటీ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 1938 నుంచి జరిగిన అధ్యయనాలను ఆధార ంగా తీసుకుంది. దాదాపు 85 ఏళ్ల కాలవ్యవధి లో ఆయా దశల్లో ఉద్యోగుల మానసిక స్థితి, జీవి తం వంటి వాటిపై పరిశీలన జరిపింది.

ముఖ్యంగా ఓవర్‌నైట్‌ షిఫ్ట్‌లు, ట్రక్‌ డ్రైవింగ్, నైట్‌ సెక్యూ రిటీతోపాటు టెక్‌ ఆధారిత పరిశ్రమలు, ప్యాకే జీ, ఫుడ్‌ డెలివరీ సర్వీసెస్, ఆన్‌లైన్‌ రిటైల్‌ జాబ్స్‌ వంటి విధుల నిర్వహణలో ఉద్యోగులు ఒంటరి తనం ఫీలై అసంతృప్తికి గురవుతున్నట్టు తేలింది. మనుషులతో కానీ, చేస్తున్న పనులతోనూ అంతగా మమేకం కాకపోతే చేస్తున్న పనిలో, ఉద్యో గంలో సంతృప్తి ఉండదని ఉద్యోగులు చెప్పారు.  – సాక్షి, హైదరాబాద్‌

ఏం చేయాలి? 
♦
మిత్రులు, సహోద్యోగులతో తమకున్న ఆసక్తులు, అభిరుచులు పంచుకోవాలి. 
♦ తోటి ఉద్యోగులు, టీం సభ్యులతో స్నేహసంబంధాలు పెంచుకుంటే అది ఉద్యోగుల్లో మనో బలం పెరిగేందుకు దోహదపడుతుంది. ఫలి తంగా మరింత చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. 
♦ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవడం లేదా క్లబ్‌గా ఏర్పడటం, పుస్తకాలు చదవడం, గేమింగ్‌ కమ్యూ నిటీగా ఏర్పడటం వంటివి చేయాలి. ఇతరుల సహాయం కోరడంతోపాటు, వారికి సహాయపడేందుకూ సిద్ధంగా ఉండాలి. 
♦ టీం సభ్యులతో పనికి సంబంధించిన అంశాలతోపాటు ఇతరత్రా అంశాలపైనా చర్చించాలి. 
♦ పనిప్రదేశాల్లో సహోద్యోగులతో సానుకూల సంబంధాల వల్ల పని ఒత్తిడితో పాటు ఆందోళన, అయోమయం వంటివీ తగ్గుతాయి. 

ఇంకా ఈ నివేదికలో ఏముందంటే..
♦ బిజీ జాబ్స్‌ చేస్తున్నా ఇతరులు, సాటి ఉద్యోగులతో సానుకూల ఇంటరాక్షన్లు లేకపోతే ఉద్యోగులు ఒంటరిగా ఉన్నామన్న భావనలో ఉంటున్నారు. 
♦ సహోద్యోగులు, మనుషులను కలుసుకునే అవకాశం లేకపోతే అదొక పెద్ద వెలితిగా ఉంటుంది. వారితో కొంత సమయం గడిపితే పనిపట్ల సంతృప్తితోపాటు మెరుగ్గా విధులు నిర్వహించే  అవకాశం ఉంటుంది. 
♦ కోవిడ్‌ కారణంగా ‘రిమోట్‌వర్క్‌’విధానంతో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి 
♦ ముఖ్యంగా టెక్, ఫుడ్‌ డెలివరీ, ఆన్‌లైన్‌ రిటైల్‌ సర్విసెస్‌ తదితర రంగాల్లోని ఉద్యోగులు ఒంటరితనాన్ని అధికంగా ఫీల్‌ అవుతున్నారు. 

టీమ్‌ వర్క్‌ ముఖ్యం 
రోజువారీ పనులు, ఉద్యోగంలో సమతూకం సాధించడం వంటి వాటిపై నిర్వహించిన అధ్యయనాల్లో ఇదొకటి. ఉద్యోగం–జీవితంలో సంతృప్తి తదితరాలకు సంబంధించిన ఒక పాత రహస్యాన్ని కనుగొనేందుకు ఇది దోహదపడింది. ఉత్పాదకత కోసమే కాకుండా ఉద్యోగుల్లో మనోబలం పెంచేందుకు టీమ్‌ వర్క్‌ ముఖ్యమనే విషయం మరోసారి స్పష్టమైంది.  –ప్రొ.రాబర్ట్‌ వాల్డింగర్,  హార్వర్డ్‌ స్టడీ ఆఫ్‌ ఆడిట్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)