Breaking News

‘తీవ్ర మనోవేదనకు గురవుతున్నా’.. దీదీకి హర్భజన్‌ సింగ్‌ లేఖ

Published on Sun, 08/18/2024 - 15:21

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర రాజధాని కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆస్పత్రిలో జరిగిన ఉదంతంపై ప్రముఖ భారత మాజీ క్రికెటర్‌, ఆమ్‌ ఆద్మీ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి రెండు పేజీల లేఖ రాశారు.  

ఆర్‌జీకార్‌ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణం జరిగినా.. విచారణ మాత్రం కొలిక్కి రావడం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 

సీఎం,గవర్నర్‌కు లేఖ
ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో ‘మనందరి మనస్సాక్షిని కదిలించిన చెప్పలేని హింస. ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు ఇది. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన తీవ్రమైన దాడి. ఇది లోతుగా పాతుకుపోయిన సమస్యలకు ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దుర్ఘటన గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.

దిగ్భ్రాంతిని గురి చేసింది
ఆస్పత్రిలో వైద్యం అందిస్తూ ప్రాణం పోసే వైద్యుల పట్ల జరిగిన దారుణం దిగ్భ్రాంతిని గురి చేసిందని దీదీ రాసిన రెండు పేజీల లేఖలో ఆప్‌ ఎంజీ రాసిన లేఖలో తెలిపారు. రోజులు గడుస్తున్నా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. వారి (వైద్యుల) నిరసనల్ని సమాజం అర్ధం చేసుకుంది. న్యాయం కోసం వారు చేసే పోరాటానికి నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు.  

 ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకురావడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

టీవీల్లో సర్వసాధారణమయ్యాయి
దేశంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వార్తాపత్రికలు, టీవీల్లో సర్వసాధారణంగా మారాయని అన్న హర్భజన్‌ సింగ్‌..భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు సమగ్ర చర్యలు తీసుకోవాలని అని హర్భజన్‌ సింగ్‌ దీదీకి రాసిన లేఖలో డిమాండ్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)