Breaking News

అలుపెరగని సహకారం

Published on Sat, 10/18/2025 - 06:29

నాసిక్‌: హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో దేశంలో వివిధ వైమానిక స్థావరాల్లో ఉన్న యుద్ధ విమానాలకు అవసరమైన తోడ్పాటును నిర్విరామంగా అందించిందని ప్రశంసించారు. ఫలితంగా ఫైటర్‌ జెట్లు, హెలికాప్టర్ల సమర్థవంతమైన నిర్వహణ, సన్నద్ధత సాధ్యమైందన్నారు. నాసిక్‌లోని హెచ్‌ఏఎల్‌ కేంద్రంలో మంత్రి రాజ్‌నాథ్‌ శుక్రవారం తేజస్‌ తేలికపాటి యుద్ధ విమానం(ఎల్‌సీఏ)ఎంకే1ఏ తయారీ విభాగాన్ని, శిక్షణ విమానం హెచ్‌టీటీ–40 ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. 

నాసిక్‌ విభాగంలో తయారైన తేజస్‌ ఎల్‌సీఏ ఎంకే1ఏ మొట్టమొదటిసారిగా రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సుఖోయ్‌–30 ఎంకేఐ జెట్‌ విమానాలకు బ్రహ్మోస్‌ క్షిపణుల అనుసంధానంలో హెచ్‌ఏఎల్‌ నాసిక్‌ విభాగం కృషి మరువలేమన్నారు. తేజస్‌ ఎంకే1ఏ తయారీ కేంద్రంలో ఇకపై ఏటా కనీసం 24 ఎల్‌సీఏలు తయారవుతాయని వివరించారు. మిగ్‌–21, మిగ్‌–27 వంటి ఫైటర్‌ జెట్ల నుంచి సుఖోయ్‌–30 ఎంకేల వరకు తయారు చేస్తూ నాసిక్‌  కేంద్రం ఉత్పత్తి హబ్‌గా మారిందని చెప్పారు.  


 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)