Breaking News

పేలిన హెయిర్‌ డ్రయ్యర్‌.. తెగిపడిన మహిళ వేళ్లు

Published on Thu, 11/21/2024 - 13:47

బాగల్‌కోట్: ఫోన్లు, రిఫ్రజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లతో పాటు ఇప్పుడు హెయిర్‌ డ్రయ్యర్లు కూడా పేలుతున్నాయి. కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో హెయిర్ డ్రయర్‌ పేలిన ఉదంతం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఒక మహిళ  తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే ఈ ఘటనలో బాధితురాలు తన వేళ్లను కోల్పోయింది.

స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళ 2017లో జమ్ముకశ్మీర్‌లో మరణించిన మాజీ సైనికుడు పాపన్న యర్నాల్ భార్య బసవరాజేశ్వరి యర్నల్ (37)గా పోలీసులు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ పేలుడు సంభవించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. హెయిర్ డ్రయ్యర్‌ లాంటి ఉపకరణాలను ఉపయోగించడానికి, రెండు వాట్ల విద్యుత్ కనెక్షన్ అవసరం. అయితే ఆ మహిళ హెయిర్ డ్రయ్యర్‌కోసం వినియోగించిన స్విచ్‌కు అంత సామర్థ్యం లేదు. ఈ కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు బసవరాజేశ్వరి పక్కింట్లో ఉంటున్న శశికళ హెయిర్‌ డ్రయ్యర్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. అయితే ఆమె ఇంటిలో లేకపోవడంతో కొరియర్‌ బాయ్‌ ఆ హెయిర్‌ డ్రయ్యర్‌ను బసవరాజేశ్వరికి అప్పగించాడు. ఈ విషయా​న్ని ఆమె శశికళకు తెలిపింది. ఆమె చెప్పిన మీదట ఆ హెయిర్‌ డ్రయ్యర్‌ ప్లగ్‌ను సాకెట్‌లో పెట్టిగానే పేలుడు సంభవించింది.  

పేలుడు శబ్దం విన్న చుట్టుపక్కలవారు బసవరాజేశ్వరి  ఇంటికి వచ్చి చూడగా, ఆమె అరచేతులు, వేళ్లు తెగిపడి ఉన్నాయి. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హెయిర్‌ డ్రయ్యర్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ‍ప్రతికూలమా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)