కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలి.. జీవీఎల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Sat, 05/13/2023 - 10:44

సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోయింది. మ్యాజిక్‌ ఫిగర్‌ను దాదాపు క్రాస్‌ చేసే అవకాశం ఉంది. దీంతో, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా​యి. ఇదిలా ఉండగా, కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు. ఈ క్రమంలో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

​కాగా, జీవీఎల్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదు. కర్ణాటక ఫలితాలు కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతాయి. గతంలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోయినా పార్లమెంట్‌ ఎన్నికల్లో మేమే గెలిచాం. కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. తొలుత మాకు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, అంతకంటే ఎక్కు సీట్లు మాకు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఎన్నికల సంఘం ట్రెండ్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 111 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 73 స్థానాల్లో, జేడీఎస్‌ 30 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి.  ఇక, కాంగ్రెస్‌కు ఫలితాలు ఫేవర్‌గా వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. 

ఇది కూడా చదవండి: రిసార్ట్‌ పాలిటిక్స్‌.. తెలంగాణను తాకిన కర్ణాటక రాజకీయం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)