Breaking News

AIతో కాదు… రూ.370 బిర్యానీతో ఉద్యోగం ఊడింది

Published on Fri, 06/12/2026 - 08:28

ఢిల్లీ: ఏఐ యుగంలో ఉద్యోగం కాపాడుకోవడం ఎంత కష్టమో సోషల్ మీడియాలో ప్రతిరోజూ ధీనగాధలు వినిపిస్తున్నాయి. అలాంటి ఓ యువకుడు తన నోటి దురుసు వ్యాఖ్యలతోనే ఉద్యోగాన్ని కోల్పోయాడు. రూ.370 బిర్యానీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

జూన్‌ 8న హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ కేంద్రంగా స్టాండప్‌ కామెడీ షో జరిగింది. ఈ షోకి బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ప్రణిత్‌ మోరే స్టాండప్‌ కమెడియన్‌గా హాజరయ్యారు. ఈ షోలో కమెడియన్‌ ప్రణిత్‌ మోరే.. ప్రేక్షకులకు ప్రశ్నలు వర్షం కురిపిస్తుంటే.. ఆడియన్స్‌ సమాధానాల ఆధారంగా వెంటనే జోకులు వేయడం దీని ఉద్దేశం.

అయితే, ఈ కామెడీ షోలో హిమాన్షు జాంగ్రా తన డేట్ అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. నేను ఇటీవల ఓ యువతితో డేటింగ్‌కు వెళ్లాను. డేటింగ్‌ వెళ్లే సమయంలో రూ.370 పెట్టి చికెన్‌ బిర్యానీ కొనుగులో చేశాను. డేటింగ్‌ పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో ఆ యువతి నన్ను తన ఇంటి వద్ద డ్రాప్‌ చేయమని అడిగింది. అందుకు నేను కాదనలేకపోయా. అయితే, డేటింగ్‌ వచ్చే ముందు రూ.370 బిర్యానీ కొనుగోలు చేశాను. ఆ డబ్బులు వృధా కాకూడదంటూనే అతని మాటలలో రూ.370 బిర్యానీ కొనుగులో చేసినందుకు శారీరక సంబంధం ఆశించినట్లు చెప్పాడు. అంతే హిమాన్షు మాటలకు చప్పట్లతో ఆ ప్రాంతం హోరెత్తింది. భళ్లున నవ్వుకున్నారు.

హిమాన్షు చేసిన రూ.370 బిర్యానీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.హిమాన్షు నోటి దురుసుపై మహిళా సంఘాలు, ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

పలువురు పోలీసులకు ఫిర్యాదుతో మహరాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్టాండప్‌ కమెడియన్‌ ప్రణీత్‌ మోరే, ఆడియన్ హిమాన్షు జాంగ్రాపై భారత న్యాయ సంహిత చట్టంలో పలు సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. తమ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఓ టెక్‌ సంస్థలో వెబ్‌డెవలపర్‌గా విధులు నిర్వహిస్తున్న హిమాన్షు జాంగ్రాపై సదరు యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాన్షును విధుల నుంచి తొలగించింది. తాను చేసిన వ్యాఖ్యలకు హిమాన్షు క్షమాపణలు చెప్పినా వ్యాఖ్యల వివాదం ఇంకా చల్లారలేదు.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)