Breaking News

ఓటు వేశాక పంజాబ్‌ సీఎం భార్య ఏమన్నారంటే..

Published on Sat, 06/01/2024 - 12:16

లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్‌ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి,  ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.

పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో  గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్‌ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)