Breaking News

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

Published on Sun, 01/18/2026 - 21:57

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఇవాళ(జనవరి 18, ఆదివారం) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. నిన్న(శనివారం) నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. నలుగురు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

ఇప్పటివరకు లభించిన ఆరుగురు మృతదేహాలలో నలుగురిని గుర్తించారు. దిలీప్ బెడ్జా (నేషనల్ పార్క్ ఏరియా కమిటీ), మాడ్వి కోసా, లఖీ మడ్కామ రాధా మెట్టా(పార్టీ మెంబర్)లను గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, 303 రైఫిల్‌, ఇన్సాస్‌, రైఫిల్‌తో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని అటవీ, కొండ ప్రాంతాల్లో మావోయిస్టు నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం దిలీప్ బెడ్జా, ఇతర సాయుధ మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ పట్టిలింగం మాట్లాడుతూ.. బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమం కోసం డీఆర్‌జీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్‌, స్థానిక పోలీసులు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)