Breaking News

Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం

Published on Fri, 06/10/2022 - 04:37

అహ్మదాబాద్‌: తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే  జరుపుకున్నట్లు గురువారం మీడియా ఎదుట ప్రకటించింది. వడోదరలోని గోత్రి ప్రాంతానికి చెందిన క్షమాబిందు దగ్గర్లోని ఆలయంలో ఈనెల 11వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

‘ఇలాంటి పెళ్లిళ్లు ఏ గుడిలో జరిగినా అడ్డుకుంటామంటూ బీజేపీ వడోదర విభాగం ఉపాధ్యక్షురాలు సునీతా శుక్లా హెచ్చ రించారు. హిందూ యువతను పెడదోవ పట్టిస్తోందంటూ నన్ను తప్పుబట్టారు.  వైదిక సంప్రదాయంలో పెళ్లి తంతును జరిపించేందుకు పూజారి నిరాకరించారు’ అని ఆమె తెలిపింది. దీంతో ఇంట్లోనే పెళ్లి జరుపుకుంది. ఈ కార్యక్రమం వీడియోను విడుదల చేసింది. సంప్రదాయ వివాహ వేడుక మాదిరిగానే జరిగిన ఈ కార్యక్రమానికి కొద్ది మంది సన్నిహితులు హాజరైనట్లు తెలిపింది. తన వివాహం దేశంలోనే మొట్టమొదటిదని క్షమాబిందు అంటోంది. త్వరలో హనీమూన్‌కూ వెళ్తానని ప్రకటించింది.  

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)