Breaking News

Gujarat: కుటుంబాన్ని బలిగొన్న రూ. ఐదువేల ఈఎంఐ?

Published on Sun, 07/20/2025 - 12:36

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శనివారం (జూలై 19) రాత్రి బాగోద్ర గ్రామంలో ఒకే కుటుంబానికి ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరు విషం తాగారనే అనుమానాలున్నాయి. మృతుల్లో భర్త, భార్య వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.

కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులను విపుల్ కాంజి వాఘేలా (34), అతని భార్య సోనాల్ (26), వారి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవానిగా పోలీసులు గుర్తించారు. వీరి కుటుంబం మొదట గుజరాత్‌లోని ధోల్కాలో ఉండేది. విపుల్ వాఘేలా ఆటో రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, బాగోద్ర పోలీసులు, 108 అంబులెన్స్ బృందం, అహ్మదాబాద్ రూరల్ ఎస్పీ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఒత్తిడి కారణంగానే కాంజి వాఘేలా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

విపుల్ బావమరిది ఈ ఘటన గురించి మాట్లాడుతూ విపుల్‌ రుణం తీసుకుని ఆటోరిక్షాను కొనుగోలు చేశాడని, ప్రతీనెలా రూ. ఐదువేల ఈఎంఐ  కట్టలేక ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఆ భారమే అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పి ఉండవచ్చని అన్నారు.  కాగా ఈ ఐదు మృతదేహాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం బాగోద్ర కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు విపుల్‌ బంధువులను, పొరుగవారిని, పరిచయస్తులను విచారిస్తున్నారు.

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)