Breaking News

Nirmala Sitharaman: పెట్రో జీఎస్టీ ఎంతన్నది... రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి

Published on Sun, 06/23/2024 - 05:39

న్యూఢిల్లీ: ప్లాట్‌ఫాం టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదు. వాటితో పాటు రిటైరింగ్‌ రూములు, వెయిటింగ్‌ రూములు, క్లోక్‌ రూములు, ప్లాట్‌ఫాంలపై బ్యాటరీ వాహనాలు తదితర రైల్వే సేవలపై కూడా జీఎస్టీ తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సారథ్యంలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 53వ సమావేశం ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా ఈ సందర్భంగా నిర్మల చర్చలు జరిపారు.

 కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల పథకం ప్రయోజనాలను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశమని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘అందుకు అంగీకరించాల్సింది ఇక రాష్ట్రాలే. అవి ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి పెట్రోల్, డీజిల్‌పై ఎంత శాతం జీఎస్టీ వేయాలో నిర్ణయించుకుని కౌన్సిల్‌కు తెలపాలి’’ అని భేటీ అనంతరం నిర్మల మీడియాతో అన్నారు. 

‘‘ఇన్‌పుట్‌ క్రెడిట్‌ పన్నులో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయం జరిగింది. ఇన్‌వాయిసింగ్‌ తదితరాల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఇకపై దేశవ్యాప్తంగా బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి చేస్తున్నాం. జీఎస్టీ చెల్లింపు తుది గడువును ఏప్రిల్‌ 30 నుంచి జూన్‌ 30కి పొడిగించాం. తద్వారా వర్తలకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు... 
    
→ అన్ని రకాల సోలార్‌ కుక్కర్లపై ఇకనుంచి 12 శాతం జీఎస్టీ 
→ అన్ని రకాల కార్టన్‌ బాక్సులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. జమ్మూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల పళ్ల వ్యాపారులకు ప్రయోజనం. 
→ స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. 
→ విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా బయట ఉండే విద్యార్థులకు నెలకు రూ.20 వేల దాకా దాకా జీఎస్టీ మినహాయింపు 
→ స్టీల్, అల్యుమినియం, ఇనుప పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ. 
→ జీఎస్టీ ఎగవేత తదితర ఉదంతాల్లో జరిమానాలపై వడ్డీ ఎత్తివేత.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)