Breaking News

‘ధురంధరుడీ’ పెళ్లికొడుకు! 

Published on Fri, 01/23/2026 - 06:35

గుర్రం ఎక్కలేదు.. కారు రాలేదు.. అక్షయ్‌ ఖన్నాలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఓ పెళ్లికొడుకు. పెళ్లంటే కాస్త హడావుడి, బోలెడంత సందడి ఉండాలి. కానీ ఈ పెళ్లి కొడుకు చేసిన పనికి సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. ఏకంగా ధురంధర్‌ సినిమాలోని క్రేజీ డాన్స్‌ స్టెప్పును దించేసి, నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు. 

ఏమిటా ‘ధురంధర్‌’ మాయ? 
షోయబ్‌ ఖురేషీ అనే వ్యక్తి తన పెళ్లి బారాత్‌లో ‘ధురంధర్‌ ’సినిమాలోని అక్షయ్‌ ఖన్నా ఐకానిక్‌ డాన్స్‌ వాక్‌ను పునఃసృష్టించాడు. ఎఫ్‌ఏ9ఎల్‌ఏ పాటకు ఎంతో క్యాజువల్‌గా, భుజాలు ఎగరేస్తూ అతను వేసిన అడుగులు చూసి బంధుమిత్రులే కాదు, ఇంటర్నెట్‌ లోకం కూడా ఫిదా అయిపోయింది. 

ఎందుకీ సీన్‌ అంత ప్రత్యేకం? 
నిజానికి సినిమాలో అక్షయ్‌ ఖన్నా ఆ స్టెప్పును ఏ ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడే ఏదో అలా సరదాగా వేసేశారట. అదే ఇప్పుడు ఒక ‘మీమ్‌’ మెటీరియల్‌గా మారి ట్రెండ్‌ అవుతోంది. ఇప్పుడు మన వరుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో పెళ్లి వేదిక మీదకు వస్తుంటే.. నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ‘పెళ్లి కూతురు గారూ.. మీరు ఒక లైఫ్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌ని పెళ్లి చేసుకున్నారు!’.. అని ఒకరు, ‘నువ్వు తోపు బ్రదర్‌.. అందరికీ స్ఫూర్తి ఇచ్చావు’.. అని మరొకరు ప్రశంసించారు. పాప్‌ సంస్కృతిని పాకెట్‌లో పెట్టుకుని, పక్కా స్టైల్‌తో వరుడు ఇచి్చన ఎంట్రీ ఇప్పుడు వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ ప్రపంచంలో ఒక కొత్త మైలురాయి. గుర్రాలు, ఏనుగులు కంటే ఈ ‘ధురంధర్‌’నడకే వెరీ వెరీ స్పెషల్‌! 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)