Breaking News

ఫేషియల్‌ పేరుతో వరుడు జంప్.. తరువాత జరిగిందిదే..

Published on Mon, 06/12/2023 - 15:20

పెళ్లికి ముందురోజు వరుడు ఫేషియల్‌ చేయించుకుంటానని బయటకు వెళ్లి  ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఫోను చేసేందుకు ప్రయత్నించగా స్విచ్‌ఆఫ్‌ అని వచ్చింది. విషయం వధువు తరపువారికి తెలియడంతో నానా హంగామా జరిగింది. అనంతరం వధువు తరపువారు వరుని తండ్రి నుంచి కట్నం డబ్బులను తిరిగి తీసుకోవడంతోపాటు పెళ్లిని రద్దు చేసుకున్నారు. 

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వరుడు ఫేషియల్‌ చేయించుకుంటాననే నెపంతో బయటకు వెళ్లి ఇక తిరిగి రాలేదు.  తరువాత ఈ వ్యవహారం వివాహం రద్దు చేసుకునేవరకూ దారితీసింది.  ఈ ఉదంతం బఘౌచ్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకునికి వివాహం నిశ్చయమయ్యింది.

జూన్‌ ఆరున వరుడిని పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరిగింది. జూన్‌ 11 వివాహ వేడుకలో భాగంగా కుషీనగర్‌ జిల్లాలోని ఫాజిలా నగర్‌ పరిధిలోని ఒక గ్రామానికి వరునితో పాటు అతని బంధువర్గమంతా చేరుకోవాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.  బ్యాండు మేళం వారు కూడా వచ్చేశారు. ఇంతలో వరుడు ఫేషియల్‌ చేయించుకుంటానని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ వరుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలయ్యింది.  ఎన్నిచోట్ల వెదికినా అతని ఆచూకీ తెలియలేదు.  
చిన్న కుమారునితో వివాహం చేయిస్తామన్నా...
ఈ విషయం  వధువు ఇంటిలోని వారికి తెలిసింది. వారు పరుగుపరుగున వరుని ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తరువాత వరుని తండ్రి వధువు తరపువారితో తన చిన్న కుమారునితో ఈ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఇది వధువు తరపువారికి ఎంతమాత్రం నచ్చలేదు. తాము ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని చెబుతూ తాము ఇచ్చిన కట్నం సొమ్ముతోపాటు కానుకలను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దీనిపై గ్రామంలో పంచాయితీ జరిగింది. పంచాయతీ పెద్దల తీర్మానం మేరకు వరుని తరపు వారు తాము తీసుకున్న కట్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ పెళ్లి రద్దయ్యింది. కాగా వరుడు ఒక ఫుడ్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వేరే యువతితో సంబంధం ఉన్న కారణంగానే  పెళ్లి వేడుక ముందురోజు ఇంటి నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి..
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)