Breaking News

కాళ్ల పారాణి ఆరకముందే అత్తింట్లో అల్లుడు..

Published on Thu, 12/04/2025 - 10:59

జీవితంలో పెళ్లి అనేది ప్రతి ఒక్కరికీ మధురానుభూతిని కల్గించే మహత్తర ఘట్టం. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు తమ కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించారు. పెళ్లయిన మరుసటి రోజున వరుడు అత్తవారింటికి తిరిగింపులకు రాగా బాజాభజంత్రీలతో గ్రామ వీధుల్లో ఊరేగించారు. అయితే పెళ్లి కుమార్తె కాళ్ల పారాణి ఆరకముందే వరుడు అత్తింట్లో గుండెపోటుతో మరణించడంతో అటు పెళ్లి కుమార్తె, ఇటు పెళ్లి కుమారుడి ఇళ్లలో తీవ్ర విషాదం, బాధ, కన్నీరు మిగిలాయి.

సాక్షి బళ్లారి: పెళ్లయిన మరునాడే నవవరుడు గుండెపోటుతో మరణించిన ఘటన విజయనగర జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు..శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకా హనుమంతపుర గ్రామానికి చెందిన రమేష్‌(30) అనే యువకుడికి విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బండ్రి గ్రామానికి చెందిన ఓ యువతితో ఏడాది క్రితం నిశ్చితార్థం జరగగా నవంబర్‌ 30వ తేదీన పెళ్లి జరిగింది. అనంతరం మంగళవారం పెళ్లి కుమార్తె ఇంటికి వధువు, వరుడు తిరిగింపులకు రావడంతో పెద్ద ఎత్తున గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగింపును కూడా నిర్వహించారు. 

వధువు ఇంటికి చేరిన తర్వాత పెళ్లి కుమార్తె ఇంట్లో కాలు పెట్టగానే వరుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. అతనిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటనతో పెళ్లి కుమార్తె ఇంట ఆక్రందనలు మిన్నంటాయి. కాగా పెళ్లి కుమారుడు రమేష్‌ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో తల్లి సొంత ఊరు హొసకుప్పె గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లి చేసుకొన్న మరుసటి రోజే మృతి చెందడంతో అటు అతని అమ్మమ్మ ఇంట్లో కూడా విషాదం నెలకొంది. ఈ ఘటనతో పెళ్లి సందడి ఆవిరై కన్నీటి పర్యంతంగా మారింది. ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పెళ్లి కుమార్తె రోదనను ఆపడం ఎవరి తరం కాలేదు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)