Breaking News

గుర్రంపై ఊరేగుతూ  ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు 

Published on Sun, 02/16/2025 - 00:34

ష్యోపూర్‌(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్‌ జాట్‌ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. 

ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్‌ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్‌బీ గోయల్‌ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ)కి ష్యోపూర్‌ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)