Breaking News

అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్

Published on Sun, 07/02/2023 - 16:34

లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు.  

ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం  చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. 

అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది.         

ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)