Breaking News

విమానం రద్దు.. ప్రేమకు ఆకాశమే హద్దు..!

Published on Tue, 12/16/2025 - 18:03

ఇటీవల ఇండిగో విమానాల రద్దు ఎపిసోడ్‌ పెద్ద హాట్‌ టాపిక్‌. ఇండిగో ప్రయాణికుల తిప్పలు ఇక్కడ వర్ణనాతీతం.   కొత్త పైలట్ విశ్రాంతి నియమాలు, షెడ్యూల్ ప్లానింగ్ లోపాలు,  శీతాకాల రోస్టర్ ఒత్తిడి వల్లే ఈ భారీ రద్దులు జరిగాయి  ఫలితంగా ప్రయాణికులకు అవస‍్థల తప్పలేదు. అయితే వీటితో ఇప్పడు ఒక సంఘటన వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్న వరుడు.. ఇండిగో విమానం రద్దుతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. 

అది కూడా పెళ్లి చివరి నిమిషంలో ఫ్లైట్‌ రద్దైన విషయం తెలియడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయాన్ని వధువుకి కూడా చేరవేశాడు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు.  వరుడు ఎక్కడో ఉన్నాడు.. వధువు కూడా వేరే చోట అంటే ఫ్లైట్‌ .జర్నీ చేసి వస్తే కానీ ముహూర్తానికి అందనంత దూరంలో ఉంది. ఒకవైపు పెళ్లి కొడుకులో టెన్షన్‌..మరొకవైపు పెళ్లి కూతురిలో అంతకుమించి ఆందోళన. 

ముహూర్తం సమయానికి పెళ్లి అవుద్దా.. లేదా అనే సందిగ్థంలో పడింది. అయితే వరుడ మాత్రం తన ప్రేమకు ఎల్లలు లేవని భావించాడు. అందుకే చార్టర్‌ ఫ్లైట్‌(ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం)లో వాలిపోయాడు. ఇంకేముంది కథ సుఖాంతమైంది.. వధువు అనందానికి హద్దుల్లేకుండా పోయింది. వరుడుకి ఘనస్వాగతం లభించింది.. వధువు తన డ్యాన్స్‌తో అలరించి కాబోయే భర్తకు ఘనంగా ఆహ్వానం పలికింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ  ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)