Breaking News

మెడికల్‌ కాలేజీ మృతులెందరు?

Published on Sat, 06/14/2025 - 06:31

అహ్మదాబాద్‌: ఎయిరిండియా విమానానికి సంభవించిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై గురువారం అర్ధరాత్రికే స్పష్టత వచ్చింది. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందికి గాను ఒక్కరు మినహా అందరూ దుర్మరణం పాలయ్యారు. 241 మంది మరణించినట్టు ఎయిరిండియా అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం టేకాఫైన 33 సెకన్లకే రన్‌వే సమీపంలోని బీజే మెడికల్‌ కాలేజీ మెస్, హాస్టల్‌పై పడి పేలిపోవడం తెలిసిందే. 

ఆ సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉండటంతో అత్యంత భారీ పేలుడు సంభవించింది. దాంతో మెస్, హాస్టల్‌ ధ్వంసమవడమే గాక పరిసర భవనాలకూ నిప్పంటుకుని కాలిపోయాయి. కానీ అక్కడి వారిలో ఎందరు చనిపోయారన్న దానిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. దీనిపై గుజరాత్‌ ప్రభుత్వం గానీ, కేంద్రం గానీ అధికారికంగా స్పందించలేదు. కనీసం 24 మంది మరణించినట్టు గురువారమే వార్తలొచ్చాయి. 

గురువారం అర్ధరాత్రికే ఆస్పత్రికి 265 మృతదేహాలు వచ్చినట్టు డీఎస్పీ కనన్‌ దేశాయ్‌ చేసిన ప్రకటన వాటికి బలం చేకూర్చింది. నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఒక వైద్యుడు, మరో వైద్యుడి భార్య మృతిని కాలేజీ వర్గాలు గురువారం రాత్రి ధ్రువీకరించాయి. మరో 60 మందికి పైగా వైద్యులు, వైద్య విద్యార్థులు గాయపడ్డట్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. వారిలో 19 మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించింది.

 అంతేగాక ఇద్దరు ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థులు, ఒక వైద్యుని తాలూకు ముగ్గురు బంధువుల ఆచూకీ తెలియడం లేదని కాలేజీ డీన్‌ డాక్టర్‌ మీనాక్షీ పారిఖ్‌ తెలిపారు. వీరి పరిస్థితి ఏమిటన్నది మాత్రం శుక్రవారం అర్ధరాత్రి దాకా తెలియరాలేదు. ప్రమాదస్థలి వద్ద భవనాల శిథిలాలు తదితరాలను తొలగించేందుకు ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శ్రమిస్తున్నట్టు సంస్థ డీజీ హరి ఓం గాంధీ శుక్రవారం తెలిపారు. మృతులపై మాత్రం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. 

దాంతో మొత్తం మృతుల సంఖ్యపై రకరకాల ఊహాగానాలు విన్పించాయి. శుక్రవారం మరో నలుగురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల మృతదేహాలు లభించాయని, మొత్తం మృతుల సంఖ్య 325కి చేరిందని వార్తలొచ్చాయి. గుజరాత్‌ పోలీసులు కూడా మృతుల సంఖ్య 294కు చేరినట్టు శుక్రవారం మధ్యాహ్నం చెప్పారు. కానీ, ‘240 మందికి పైగా మరణించార’ంటూ సాయంత్రానికల్లా సవరణ ప్రకటన చేశారు! మెడికల్‌ కాలేజీ మృతుల సంఖ్యను ప్రభుత్వం ఎందుకు గుట్టుగా ఉంచుతున్నదీ అంతుబట్టడంలేదు. 
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)