విషాదం.. 13వ అంతస్తు నుంచి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య

Published on Sun, 09/14/2025 - 11:33

ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విషాదం చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న కుమారుడితో కలిసి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సాక్షి చావ్లా(37) తన భర్త దర్పణ్ చావ్లా, కొడుకు దక్ష్(11)తో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఏస్ సిటీలో నివసిస్తున్నారు. కుమారుడు పదేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడటంతో చికిత్స చేయిస్తున్నారు. కుమారుడి అనారోగ్యంపై చావ్లా తీవ్ర ఆందోళన పడేది.

ఈ క్రమంలో తన కుమారుడి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి తన కొడుకుతో కలిసి 13వ అంతస్తు ఫ్లాట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన దర్పణ్ చావ్లా ఈ విషాద ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అతను మరొక గదిలో ఉన్న సమయంలో కేక వినిపించిందని, బాల్కనీకి చేరుకోగానే తన భార్య, కొడుకు కింద పడి ఉన్నారని ఆయన పోలీసులకు తెలిపారు. 'క్షమించండి' అంటూ భర్తకు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

"మేము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం.. క్షమించండి. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మేము కోరుకోవడం లేదు. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అంటూ ఆమె సూసైడ్ నోట్‌లో రాసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)