Breaking News

ఇక గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌! 

Published on Fri, 02/27/2026 - 05:49

న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి కఠిన నిబంధనలతో కూడిన గ్రేడ్‌ పాయింట్ల ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్నిరకాల ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేసే అంశాన్ని ఇందులో చేర్చబోతున్నారు. 

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనల కారణంగా దేశంలో ప్రతిఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. 1.8 లక్షల మంది మరణిస్తున్నారు. ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం, ఓవర్‌ స్పీడ్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర రహదారి, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు.

 ప్రజల ప్రాణాల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రహదారి భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోడ్‌ సేఫ్టీపై సీఐఐ నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు ఇప్పటికే పెంచామని గుర్తుచేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు అమలు చేయడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు. చట్టం అంటే ప్రజల్లో భయం గానీ, గౌరవం గానీ ఉండడం లేదని ఆక్షేపించారు.  

పదేపదే ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు  
డ్రైవింగ్‌ లెసెన్స్‌ల జారీలో గ్రేడ్‌ పాయింట్‌ వ్యవస్థను తీసుకురాబోతున్నామని నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. ఇందులో ప్రతి వాహనదారుడికి కొన్ని గ్రేడ్‌ పాయింట్లు ముందే కేటాయిస్తారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినప్పుడల్లా కొన్ని పాయింట్లు తగ్గిస్తారు. అలా మొత్తం పాయింట్లు సున్నాకు చేరినప్పుడు అతడి లైసెన్స్‌ను ఆరు నెలలపాటు రద్దు చేస్తారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వ్యవస్థను త్వరలో తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)