Breaking News

గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం..

Published on Fri, 06/16/2023 - 10:49

తమిళనాడు:తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర సీఎం మధ్య వివాదం.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ విషయంలో మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యం బాగులేని కారణంగా మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించే అంశాన్ని గవర్నర్ తోసిపుచ్చారు.

రాష్ట్రంలో విద్యుత్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలను ప్రస్తుతం మంత్రి సెంథిల్ బాలాజీ నిర్వహిస్తున్నారు. ఈ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నెరసు, గృహ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామికి కేటాయిస్తున్నట్లు పేర్కొని సీఎం స్టాలిన్‌.. గవర్నర్‌కు లేఖ పంపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆర్‌.ఎన్‌. రవి.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ఈ ప్రతిపాదన మనీలాండరింగ్ కేసును తప్పదారిపట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. 

ఈ వ్యవహారాన్ని అధికార డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గవర్నర్ పూర్తిగా బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్ముడి  ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే ఆరోపణలపై ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించాలని గవర్నర్ మే31 న సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారని పొన్ముడి ఆరోపించారు. కేవలం ఆరోపణలపై ఎలాంటి చర్య తీసుకోబోమని సీఎం స్టాలిన్ తిరిగి లేఖలో అప్పుడే సమాధానమిచ్చినట్లు చెప్పారు. 

సెంథిల్ బాలీజీ కేసు..
‘క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ(47)ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ మంత్రి సెంథిల్ బాలాజీ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్‌ కావడం విశేషం. 

ఇదీ చదవండి:తమిళ మంత్రి అరెస్టు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)