Breaking News

గోధుమ నిల్వలపై పరిమితులు

Published on Tue, 06/13/2023 - 05:46

న్యూఢిల్లీ: పెరుగుతున్న గోధుమ ధరలను కట్టడి చేసేందుకు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. తక్షణమే అమల్లోకి రానున్న ఈ పరిమితులు 2024 మార్చి వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం(వోఎంఎస్‌ఎస్‌) విధానం కింద సెంట్రల్‌ పూల్‌ నుంచి 15 లక్షల టన్నుల గోధుమలను ఈ నెలాఖరులోగా టోకు వినియోగదారులకు, వ్యాపారులకు అందజేయనున్నట్లు వివరించింది. నిల్వలు సరిపోను ఉన్నందున గోధుమల దిగుమతి విధానాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని తెలిపింది.

గోధుమల ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పంచదార ఎగుమతులకు అనుమతి లేదని వెల్లడించింది. గోధుమల నిల్వలపై కేంద్రం చివరిసారిగా 2008లో పరిమితులు విధించింది. గత నెలతో పోలిస్తే గోధుమల మార్కెట్‌ ధరల్లో 8% పెరుగుదల నమోదు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా తెలిపారు. గోధుమ వ్యాపారులు/హోల్‌ సేలర్లు 3 వేల టన్నుల వరకు, రిటైలర్లు 10 టన్నులు, మిల్లర్లయితే స్థాపిత సామర్థ్యంలో 75% వరకు గోధుమలను నిల్వ ఉంచుకోవచ్చని ఆయన చెప్పారు. వీరు ఎప్పటికప్పుడు నిల్వ సమాచారాన్ని ఆహారం, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)