Breaking News

గవర్నమెంట్ యాక్షన్.. త్వరలో సమన్లు

Published on Sun, 12/07/2025 - 08:44

భారత వైమానిక రంగం కొద్ది రోజులుగా స్తంభించిపోయింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటరీ కమిటీ త్వరలో ఇండిగోతో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేయనుంది.

దేశీయ విమానయాన సంస్థ ఇండిగో చేసిన పని దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించింది. పెద్దఎత్తున ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినప్పటికీ వాటిసమాచారం సదరు ప్యాసింజర్స్ కి చేరవేయకపోవడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకొని  తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ ఇండిగో ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని విమానయాన సంస్థలతో పాటు డీజీసీఏకు పార్లమెంటరీ కమిటీ త్వరలో సమన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేవలం వివరణ అడగడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

కమిటీ మెంబర్ మాట్లాడుతూ "భారత విమానయాన చరిత్రలో ప్రస్తుతం విపరీత పరిస్థితులు నెలకున్నాయి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో ఎయిర్ లైన్స్ తో పాటు రెగ్యులెటరీ అథారిటీ తెలపాలి. వాటిని ఎదుర్కొవడంలో  వారు ఎందుకు విఫలమయ్యారో వివరించాలి" అని అన్నారు.       

అదే విధంగా ప్రస్తుతం జరిగిన సంఘటన విమానయాన రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుందని సిబ్బంది కొరత, నిర్వహణలో ఒత్తిడి, రెగ్యులెటరీ వ్యవస్థల మధ్య గ్యాప్ తదితర అంశాలను సూచిస్తుందని తెలిపారు. అంతేకాకుండా విమానాలు రద్దయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే ఇతర విమానాయాన సంస్థలు ఇదే అదనుగా భావించి టికెట్ ధరలను విపరీతంగా పెంచాయని ఈ అంశాలన్నింటినీ   పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుందని కమిటీ సభ్యుడు తెలిపారు. జేడీయూ నేత సంజయ్ కుమార్ జా  ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)