Breaking News

Delhi air pollution: ‘గ్రాప్‌-4’ అమలును పర్యవేక్షించిన మంత్రి.. అధికారులకు సూచనలు

Published on Sat, 11/23/2024 - 07:55

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్‌)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.

గ్రాప్‌ విధానంలోని ఫేజ్-4 అమలును  పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్‌- ఫోర్‌, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్‌ రాయ్‌ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని  అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 
 

రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి  చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో  ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్‌ సూచనలు
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)