Breaking News

క్షమించండి నాన్నా, ప్రభుత్వోద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించా..!

Published on Tue, 07/21/2026 - 07:34

కాన్పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 23 ఏళ్ల బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపో యినందుకు తండ్రికి క్షమాపణలు చెబుతూ సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయాడు. మృతుడు ఆనంద్‌ కుమార్‌ కాన్పూర్‌లోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ‘ప్రణవీర్‌ సింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. 2024లో టాపర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌లో మూడో ర్యాంకును సాధించాడు. గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ కూడా తీసుకున్నాడు. 

తండ్రి రాజ్‌కుమార్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. పెద్ద కొడుకు వివాహ సంబంధం కోసం కుటుంబమంతా బీహార్‌లోని తమ స్వగ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో గోవింద్‌నగర్‌లోని మూడంతస్తుల ఇంట్లో ఆనంద్‌ ఉరివేసుకు కున్నాడు. ఉదయం వచ్చిన పనిమనిషి తలుపు తట్టినప్పటికీ అతను స్పందించకపోవడంతో ఇరుగుపొరుగుకు తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపుతెరిచి చూడగా యువకుడి మృతదేహం లభ్యమైంది. చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. 

కానీ విజయం సాధించలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆంగ్లంలో రాసి ఉంది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ముందు అతను ‘పవర్‌ గ్రిడ్‌’లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేశాడని అతని తండ్రి రాజ్‌కుమార్‌ తెలిపారు. రైల్వేలు, ఎస్‌ఎస్‌సి (స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌), బ్యాంకులు, విద్యా శాఖ నిర్వహించిన నియామక పరీక్షలకు హాజరయ్యాడు. విజయం సాధించలేకపోయాడు. కొన్ని నెలలుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆనంద్‌ చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)