Breaking News

‘ఓటు వేశాక పెళ్లికి రండి’.. ఆకట్టుకుంటున్న శుభలేఖ

Published on Tue, 11/19/2024 - 12:30

గొడ్డా: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ నేపధ్యంలో ఒక పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ వివాహ శుభలేఖకు ఓటింగ్‌కు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. స్థానికులు ఈ పెళ్లి కార్డు గురించి తెగ చర్చించుకుంటున్నారు.

జార్ఖండ్‌లోని గొడ్డాలో నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 29న ఈ ప్రాంతానికి చెందిన ఒక లోకోపైలెట్‌ వివాహం చేసుకోబోతున్నాడు. అతిథులను ఆహ్వానించేందుకు ప్రత్యేక రీతిలో పెళ్లికార్డు ముద్రించాడు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేసేందుకు ఆ లోకోపైలెట్‌ ముందుకొచ్చాడు.

తన పెళ్లి కార్డులో ‘పెళ్లికి హాజరయ్యే ముందు అతిథులంతా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు పాత్ర పోషించాలి. మొదట ఓటు వేయండి. తరువాత పెళ్లికి రండి’ అని ముద్రింపజేశాడు. ఈ కార్డును చూసిన వారంతా ఆ లోక్‌పైలెట్‌ పెళ్లి కొడుకు రాజ్‌ కుమార్‌ సింగ్‌ను మెచ్చుకుంటున్నారు.

గొడ్డాలో నివసించే శివ కుమార్ సింగ్ కుమారుడు రాజ్‌కుమార్ సింగ్‌కు నవంబర్‌ 29న వివాహం జరగనుంది. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఈ నెల 20వ తేదీలోగానే పెళ్లి కార్డులన్నింటీ పంపిణీ చేస్తున్నామని వరుని సోదరుడు అభినవ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 400 కార్డులు పంపిణీ చేశామని, 20వ తేదీ ఉదయాన్నికల్లో మరో 200 కార్డులు పంపిణీ చేస్తామన్నారు. మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని  అభినవ్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: తాజ్‌ మహల్‌ మాయం.. పొద్దున్నే షాకింగ్‌ దృశ్యం

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)