Breaking News

మిస్‌ ఇండియా సాధ్వీ సతీశ్‌

Published on Mon, 04/20/2026 - 06:12

భువనేశ్వర్‌: గోవా సుందరి సాధ్వీ సతీశ్‌ సైల్‌ 2026 సంవత్సరానికి ఫెమీనా మిస్‌ ఇండియా వరల్డ్‌ కిరీటం దక్కించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శనివారం రాత్రి అట్టహాసంగా జరిగిన 61వ ఎడిషన్‌ గ్రాండ్‌ ఫినాలేలో దాదాపు 30 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. మహారాష్ట్రకు చెందిన రాజ్‌నందిని పవార్‌ తొలి రన్నరప్‌గా, జమ్మూ కశ్మీర్‌కు చెందిన డాక్టర్‌శ్రీ అద్వైత రెండో రన్నరప్‌గా నిలిచారు. సాధ్వీ ఆత్మవిశ్వాసం, నిబ్బరం, ఆలోచనల్లో స్పష్టత ఆమెకు కిరీటాన్ని కట్టబెట్టాయి. 75వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. 

సామాజిక సేవలో ముందు 
గోవాలో జన్మించిన సాధ్వీ సతీశ్‌ ఉన్నత విద్య అభ్యసించారు. కెనడాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో పీజీ చేశారు. మో డల్‌గా పలు ఫ్యాషన్‌ షోల్లో పాల్గొన్నారు. వాణిజ్య ప్రకటనల్లో నటించారు. నిర్మాణ రంగంలోకీ అడుగుపెట్టారు. ఓ కంపెనీ సహ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు. ఆమె పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. సామాజిక సేవ రంగంలోకీ దిగారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు సేవలందిస్తున్నారు. బధిర చిన్నారులకు అండగా నిలుస్తున్నారు. ఫెమీనా మిస్‌ ఇండియా గోవా–2026 కిరీటం కూడా దక్కించుకున్నారు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)