Breaking News

ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఇండియాకు

Published on Tue, 12/16/2025 - 10:08

గోవా నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) తరువాత బ్యాంకాక్‌ పారిపోయిన ప్రధాన ప్రధాన నిందితులు క్లబ్ ఓన‌ర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్‌ లూత్రా (Saurabh Luthra)  థాయిల్‌లాండ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  వీరిని ఇండిగో విమానంలో (6E1064) తిరిగి తీసుకువస్తున్నారు.  బ్యాంకాక్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1:45 గంటలకు (IST) బయలుదేరాల్సి ఉంది. ఢిల్లీ చేరిన తరువాత వీరిని ఇద్దరినీ పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరుస్తారు, అధికారులు వారి ట్రాన్సిట్ రిమాండ్ కోరుతున్నారు. అనంతరం వీరిని గోవాకు తరలించాలని యోచిస్తున్నట్టు సమాచారం. 

గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన కొన్ని గంటల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌కు పారిపోయారు. ఈ ఘటన తరువాత లూత్ర సోదరులపై నేరపూరిత హత్య మరియు నిర్లక్ష్యం కేసు నమోదైనాయి. వీరిని   అరెస్ట్‌ చేసే క్రమంలోనే లూత్రా బ్రద‌ర్స్ పాస్‌పోర్టుల‌ను కూడా అధికారులు ర‌ద్దు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు సిబ్బందినిఅరెస్టు చేశారు, వారిలో మేనేజర్ కూడా ఉన్నారు. క్లబ్ కు పర్మిట్లు, లైసెన్సులు జారీ చేయడంలో పాల్గొన్న అనేక ప్రభుత్వ విభాగాల అధికారులను కూడా  విచారిస్తున్నారు.  తాను "సైలెంట్ పార్టనర్" అని చెప్పుకున్నప్పటికీ,  మూడవ భాగస్వామి అజయ్ గుప్తాను కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. డిసెంబర్ 9న థాయిలాండ్‌లోని తమ హోటల్ నుండి భోజనం కోసం బయటకు వచ్చిన తర్వాత ఇద్దరినీ థాయిలాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

 
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)