Breaking News

గోవా ప్రమాదం.. మరో నైట్ క్లబ్ కూల్చివేత

Published on Tue, 12/09/2025 - 15:41

ఇటీవల గోవాలో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రమాదం జరిగిన "బిర్చ్ బై రోమియో నైట్ క్లబ్" యజమానులకు సంబంధించిన మరో క్లబ్ ను మంగళవారం  కూల్చివేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గోవాలోని నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 25మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి కారణం అక్రమ నిర్మాణంతో పాటు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడమే అని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో  నైట్ క్లబ్ యజమాని  గౌరవ్ లూథ్రాకు చెందిన బీచ్ షేక్ అనే మరో క్లబ్ ను  కూల్చివేయాల్సిందిగా ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అధికారులు ఆ  బీచ్‌షేక్‌ను కూల్చివేశారు. ఈ రోజు ఉదయం అక్కడే ఉన్న ఓ అధికారి మాట్లాడుతూ "అక్రమంగా నిర్మించిన పోర్షన్ ను కూల్చివేయమని పర్యాటక శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. నార్త్ గోవా కలెక్టర్  ఆకట్టడాన్ని కూల్చివేయాల్సిందిగా పోలీసుశాఖ, ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వారు ఈ రోజు కూల్చివేతలు చేపడతారు" అని అన్నారు.

నైట్ క్లబ్ నిర్మాణం తాటాకులతో ఉండడంతో పాటు ఆ క్లబ్ కు వెళ్లే దారులు ఇరుకుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఇరుకైన దారులు కావడంతో సహాయక బృందాలు సరైన సమాయానికి ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోలేకపోయాయన్నారు. గతంలోనూ ఆ క్లబ్ ను కూల్చివేయాలంటూ నోటీసులిచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆ ప్రాంతంలోని నాయకులు తెలిపారు.

కాగా ఈ రోజు ఉదయం గోవా పోలీసులు  విచారణ నిమిత్తం ఢిల్లీలోని నైట్ క్లబ్ యజమానుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ గౌరవ్ లూథ్రా, సౌరవ్ లూథ్రాలు లేరు. వీరిద్దరూ ప్రమాదం జరిగిన అనంతరం థాయ్‌లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ నైట్‌క్లబ్ ఓనర్ గౌరవ్ లూథ్రా థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టులో ఉన్న చిత్రాలు బయిటకి వచ్చాయి. కాగా వీరిద్దరిపై  అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ తో పాటు ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులు జారీచేశారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)