Breaking News

వృత్తి, వ్యక్తిగత జీవితంలో సమతుల్యత ఉందా?

Published on Wed, 11/05/2025 - 03:56

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విధులు, పని–వ్యక్తిగత జీవితాల మధ్య ఆరోగ్యకరమైన సమతుల్యతను సాధించడం కీలకంగా మారింది. వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతోపాటు జీవన నాణ్యతను ఎంత వరకు సమతౌల్యంగా ఉండేలా చూస్తున్నారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. సంప్రదాయ ‘పని–జీవిత సమతౌల్యత’విధానాల మాదిరిగా కాకుండా ‘జీవితం–పని సమతుల్యత’సాధన అనే అంశానికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. 

మెరుగైన జీవనశైలితో జీవితానికి మొదటగా, పని లేదా విధులకు ఆ తర్వాత ప్రాధాన్యతనివ్వడం కొంతకాలంగా ఓ నూతన ధోరణిగా ప్రచారంలోకి వచి్చంది. సంతోషకరమైన జీవితం గడుపుతూ పనిపై ఆధిపత్యం చెలాయించకుండా చూడటాన్ని ప్రభావపూరితమైన వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌గా అంచనా వేస్తున్నారు. చాలా దేశాల్లో ఎక్కువ పని గంటలు, అసమతౌల్య ఆహారం గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. 

ఇదీ అధ్యయనం...
గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ సంస్థ ‘రిమోట్‌’ఏటా ప్రపంచంలోని అత్యధిక జీడీపీ ఆధారిత 60 దేశాలను సర్వే చేస్తోంది. ఆయా దేశాల్లో చట్టబద్ధమైన చెల్లింపు సెలవులు, ప్రభుత్వ సెలవులు, అనారోగ్య సెలవులు, ప్రసూతి సెలవులు, కనీస వేతనం, ఆరోగ్య సంరక్షణ, సంతోష సూచిక, వారంలో పని గంటలు, ప్రజాభద్రత, ‘ఎల్‌జీబీటీక్యూ ప్లస్‌’హక్కులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటోంది. 

ప్రజలు నాణ్యమైన జీవితాన్ని గడపడానికి, విధుల్లో పని చేయడానికి ఎలాంటి పరిస్థితులు వీలు కల్పిస్తాయో, ఏవి వెనుకబడి ఉన్నాయో అంచనా వేసి ర్యాంకులు ఇస్తోంది. అయితే బలమైన విధానాల కారణంగా ఉద్యోగుల శ్రేయస్సులో చిన్న ఆర్థిక వ్యవస్థలు తరచూ పెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే మెరుగ్గా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఈ ఏడాదికిగాను హెచ్‌ఆర్‌ సంస్థ విడుదల చేసిన నివేదికలో అమెరికా సహా అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు టాప్‌–10లో స్థానం లభించలేదు.

యూఎస్‌ ర్యాంక్‌ 60లో 59...
మొత్తం 60 దేశాల్లో గ్లోబల్‌ వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌–2025 పేరుతో నిర్వహించిన అధ్యయనంలో భారత్‌ 42వ ర్యాంకుతో అమెరికా కంటే చాలా ముందుంది. అగ్రరాజ్యం అమెరికా మాత్రం 59వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆధునిక, డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో ప్రజలు పగలు, రాత్రి పని చేస్తారు. అయితే పని–జీవిత సమతౌల్యత అమెరికన్లకు ప్రధాన సమస్యగా మారింది. 

ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ఉద్యోగులు తక్కువ వేతనంతో కూడిన సెలవులు, తక్కువ కనీస వేతనం పొందుతున్నట్లు వెల్లడైంది. భారత్‌లో ఉద్యోగులు 35 రోజుల వేతనంతో కూడిన సెలవులను పొందుతున్నారు. పేలవమైన ఆరోగ్య సంరక్షణ, పరిమిత అనారోగ్య సెలవులు, సుదీర్ఘ పనిగంటలు మాత్రం భారత ఉద్యోగులకు సవాళ్లుగా నిలుస్తున్నాయి.

న్యూజిలాండ్‌కు టాప్‌ ర్యాంక్‌...
ఈ నివేదికలో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడి ఉద్యోగులు మంచి వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులను పొందుతున్నారు. దీంతో వారి ఉద్యోగ జీవితం ఉత్తమంగా ఉంది. వారికి 32 రోజుల వేతనంతో కూడిన సెలవు లభిస్తోంది. అనారోగ్య సెలవు తీసుకుంటే జీతంలో కోత విధింపు లేదు. 26 వారాల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా అక్కడి ఉద్యోగులకు గంటకు సగటు జీతం మెరుగ్గా చెల్లిస్తున్నారు.

నివేదికలోని టాప్‌–10 దేశాలివే...
ర్యాంకు             దేశం 
1             న్యూజిలాండ్‌
2              ఐర్లాండ్‌
3             బెల్జియం
4               జర్మనీ
5               నార్వే
6             డెన్మార్క్‌
7               కెనడా
8           ఆస్ట్రేలియా
9           స్పెయిన్‌
10           ఫిన్లాండ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)