Breaking News

54 ఉన్నత విద్యాసంస్థలకు గ్లోబల్‌ గుర్తింపు

Published on Fri, 06/20/2025 - 02:44

సాక్షి. న్యూఢిల్లీ: విద్యారంగంలో భారత్‌ మరో మైలురాయిని అందుకుంది. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌–2026లో మన దేశానికి చెందిన 54 ఉన్నత విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఈ రంగంలో ఇప్పటివరకు భారత్‌ అందుకున్న అతిపెద్ద గ్లోబల్‌ రికార్డు ఇది. లండన్‌కు చెందిన గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనలిటిక్స్‌ సంస్థ క్వాక్‌క్వరెల్లీ సిమండ్స్‌ (క్యూఎస్‌) గురువారం విడుదల చేసిన వరల్డ్‌ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌–2026 జాబితాలో ప్రపంచంలోని 1,500కి పైగా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌ కోసం అకడెమిక్‌ ప్రతిష్ట, ఫ్యాకల్టీ–సూ్టడెంట్‌ నిష్పత్తి, రీసెర్చ్‌ ప్రభావం, అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వామ్యం, గ్రాడ్యుయేట్ల ఉద్యోగావకాశాలు వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.  

వరుసగా 14వ సంవత్సరం ‘ఎంఐటీ’టాప్‌.. 
అమెరికా కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయంగా వరుసగా 14వ సంవత్సరం కూడా తొలి ర్యాంకు పొందింది. తరువాత.. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ రెండో స్థానంలో, అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం మూడవ స్థానంలో ఉన్నాయి. జాబితాలో 192 విద్యాసంస్థలతో అత్యధిక ప్రాతినిధ్యం వహించే దేశంగా అమెరికా ఉంది. గత సంవత్సరం నుండి దాదాపు 500 విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరుచుకున్నాయి. వీటిలో మలేసియాలోని సన్‌వే యూనివర్సిటీ 120 స్థానాలకు పైగా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది.  

భారత్‌లో ఐఐటీ–ఢిల్లీ టాప్‌.. 
ఇక ఈ క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న భారత్‌లోని 54 ఉన్నత విద్యాసంస్థల్లో 65.5 స్కోర్‌తో ఐఐటీ–ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 2025లో 150, 2024లో 197 ర్యాంకు నుంచి ఈ ఏడాది ప్రపంచంలో 123వ స్థానానికి చేరుకుంది. అకడమిక్‌ రెప్యుటేషన్‌లో 142వ స్థానంలో, ఫ్యాకలీ్టకి సైటేషన్స్‌లో 86వ స్థానంలో నిలిచింది. దేశంలోని ఇతర ఐఐటీలు, ప్రధాన వ ర్సిటీలూ ప్రభావవంతమైన ప్రదర్శన చేశాయి. 

ఐఐటీ హైదరాబాద్‌కు 664వ ర్యాంకు, వెల్లూరు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నా లజీ (విట్‌)కు 691వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కు 801–850 మధ్య ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 1,201–1,400 మధ్య ర్యాంకులో నిలిచింది. అలాగే, ఐదు భారతీయ విశ్వవిద్యాలయాలు ఎంప్లాయర్‌ రెప్యుటేషన్‌ కోసం పోటీపడి ప్రపంచవ్యాప్తంగా టాప్‌–100లో స్థా నం సంపాదించాయి. అంతేకాక.. సగటున 43.7 స్కోరుతో 8 భారతీయ విద్యాసంస్థలు పరిశోధన ప్రభావం పరంగా సైటేషన్స్‌ ఫర్‌ ఫ్యాకల్టీలో టాప్‌–100లో స్థానం సంపాదించాయి. 

ఇక 2025లో ఉత్తమ భారతీయ విశ్వవిద్యాలయంగా ర్యాంకు పొంది గతేడాది 118వ స్థానంలో ఉన్న ఐఐటీ బాంబే, ఈ సంవత్సరం 129వ స్థానానికి పడిపోయింది. ఐఐటీ మద్రాస్‌ గతేడాదితో పోలిస్తే 47 స్థానాలు ఎగబాకి 180వ స్థానానికి చేరుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ (215), ఐఐఎస్‌సీ బెంగళూరు (219), ఢిల్లీ వర్సిటీ (328).. ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ (851–900), బిట్స్‌ పిలాని (668) వంటివి కూడా తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. 

ప్రపంచంలో భారత్‌కు 4వ స్థానం.. 
ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం భారత్‌ నుంచి ఎనిమిది కొత్త విద్యాసంస్థలు మొదటిసారిగా ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. దీంతో జాబితాలో చోటు దక్కించుకున్న మొత్తం భారతీయ విద్యా సంస్థల సంఖ్య 54కి చేరుకుంది. అమెరికా (192), యూకే (90), చైనా (72) తర్వాత నాలుగో స్థానంలో భారత్‌ నిలిచింది. ఈ సంవత్సరం మరే దేశ విద్యా సంస్థలు కూడా ఇంత ఎక్కువ సంఖ్యలో క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోలేదు. ఇక ఈ ఏడాది ఎనిమిది కొత్త విద్యా సంస్థలకు ర్యాంకులతో భారత్‌ తొలిస్థానంలో ఉండగా.. జోర్డాన్, అజర్‌బైజాన్‌ దేశాలు ఆరు కొత్త సంస్థలతో రెండో స్థానంలో ఉన్నాయి.  

ప్రధాని, కేంద్రమంత్రి హర్షం.. 
క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ–2026 ర్యాంకింగ్స్‌లో భారత్‌ సాధించిన మైలురాయిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు హర్షం వ్యక్తంచేశారు. ఈ ర్యాంకింగ్స్‌ మన విద్యా రంగానికి గొప్ప కీర్తిని తెస్తున్నాయని.. దేశ యువత ప్రయోజనం కోసం పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ వ్యవస్థలను మరింతగా పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ గురువారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

అలాగే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా ‘ఎక్స్‌’వేదికగా స్పందిస్తూ.. ‘2014లో కేవలం 11 భారత విద్యాసంస్థలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోగా, ఇప్పుడా సంఖ్య అయిదింతలు పెరిగి 54కి చేరింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో అమలుచేసిన విద్యా సంస్కరణల ఫలితం. అలాగే, నూతన విద్యా విధానం (ఎన్‌పీఈ)–2020 వల్ల ఇది సాధ్యమైంది. రికార్డు స్థాయిలో 54 సంస్థలు ఆ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోవడం భారత విద్యావ్యవస్థలో సంభవించిన మార్పు, పురోగతికి నిదర్శనం. ఇది ఒక మార్పు మాత్రమే కాదు–ఒక విద్యా విప్లవం’అని తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)