Breaking News

సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్‌ మింగేసిన యువతి

Published on Thu, 04/06/2023 - 13:36

భోపాల్‌: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి  ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే?

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్‌ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్‌ఫోన్‌ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్‌లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు.

వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్‌ను బయటకు తీశారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)