Breaking News

ప్రియుడిని పిలిచి.. గ్రామానికి కరెంట్‌ తీసేసి..

Published on Sun, 07/23/2023 - 13:19

గ్రామస్తులందరి కన్నుగప్పి తన ప్రియుడిని కలుసుకునేందుకు ఆమె ఒక పథకం వేసింది. అది విజయవంతం కావడంతో నిరాటంకంగా ప్రియుడిని కలుసుకుంటూ వస్తోంది. ఒక రోజు ఆమె పథకం విఫలమయ్యింది. దీంతో ఆమె ప్రియునితో పాటు బహిరంగంగా దొరికిపోయింది.

బీహార్‌లోని బేతియాలో ఈ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. జిల్లాలోని నైతాన్‌ ప్రాంతానికి చెందిన ప్రీతి తన ప్రియుడిని రహస్యంగా కలుసుకునేందుకు గ్రామానికి విద్యుత్‌ సరఫరా కాకుండా చూసేది. తరచూ విద్యుత్‌ పోతుండటంతో గ్రామస్తులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. 

ఒకరోజు ప్రీతి తన ప్రియుడు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామానికి కరెంట్‌ కట్‌ చేసింది. అయితే అంతటి చీకటిలోనూ ఆ ప్రేమ జంటను గ్రామస్తులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే గ్రామస్తులు ఆ యువకునిపై దాడి చేశారు. 

ఆ యువకుడిని సమీప గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌గా గుర్తించారు. తరువాత రాజ్‌కుమార్‌ ప్రీతిలకు వివాహం జరిపించారు. గ్రామానికి చెందిన సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తన తోటలో ఈ ప్రేమికులను అభ్యంతరకర స్థితిలో చూశామన్నారు. తరువాత గ్రామస్తులు వారిపై దాడి చేశారన్నారు. మరో గ్రామస్తుడు గోవింద్‌ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం పీత్రి తన ప్రియుడిని తోటలో ఎవరికంటపడకుండా కలుసుకునేందుకు ప్రతీరోజూ గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను కట్‌ చేస్తున్నదని తాము గ్రహించామన్నారు. 
ఇది కూడా చదవండి: పోలాండ్‌ మహిళకు తాళి కట్టనున్న జార్ఖండ్‌ యువకుడు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)