Breaking News

పోలింగ్‌ వేళ ‘బుర్కా’ వివాదం

Published on Thu, 11/06/2025 - 12:55

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ నేడు(గురువారం) ప్రశాంతంగా జరుగుతోంది. అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తూ, పోలింగ్‌ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్నారు. అయితే మోసపూరిత ఓటింగ్‌ను నిరోధించేందుకు బుర్ఖా ధరించిన ఓటర్ల విషయంలో కఠినమైన తనిఖీలు చేయాలని  కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

గిరిరాజ్ సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో షరియా చట్టం అమలులో లేదని, ఇది పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ కాదని.. భారత్‌ అని అన్నారు. దేశంలో లౌకికవాదం ఉందని, దేశంలో గుర్తింపు తనిఖీలు తప్పనిసరిగా జరగాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని  గిరిరాజ్ సింగ్ డిమాండ్‌ చేశారు. ఆధార్ నమోదు, విమానాశ్రయాల్లో తనిఖీల విషయంలో ఇప్పటికే ఈ తరహా ధృవీకరణ జరిగిందని అన్నారు.

తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత  గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ దేశంలో ఎన్నికల కమిషన్ నియమాలు వర్తిస్తాయని అ‍న్నారు. బుర్ఖా ధరించిన  మహిళలు ఆధార్ కార్డు తీసుకునేందుకు వెళ్లినప్పుడు, విమానాశ్రయానికి వెళ్లినప్పుడు, రిజర్వేషన్ పొందేందుకు వెళ్లినప్పుడు కూడా ఎందుకు ముసుగు తీయరని ప్రశ్నించారు. ఇది పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ కాదని.. ఇది ఇస్లామిక్ దేశమా లేక లౌకిక దేశమా? అని ప్రశ్నించారు. ఇది లౌకిక దేశమని, సందేహమొస్తే మేము వారి ముఖాన్ని చూపించేలా చేస్తామన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యకు కేంద్ర మంత్రి, ల్జేపీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ స్పందిస్తూ,  ఆయన అనవసరంగా హిందూ-ముస్లింల మధ్య వివాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)