Breaking News

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..

Published on Thu, 04/04/2024 - 14:19

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ  కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.

మార్చి 21న కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోడాతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బెంచ్‌ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. 

అయితే పిటిషనర్‌ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్‌) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం.  ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్‌ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: తీహార్‌ జైలు నుంచి ఆప్‌ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్‌ సందేశం

ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది.

అనంతరం పిటిషనర్‌ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్‌ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)