Breaking News

ఘజియాబాద్‌లో అక్కాచెల్లెళ్ల కేసులో కొత్త ట్విస్ట్‌

Published on Fri, 02/06/2026 - 10:52

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, వీరి ఆత్మహత్యలకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతుల తండ్రి.. అప్పుల్లో కూరుకుపోవడం, వారి చదువులు మాన్పించడం వంటి అంశాలు ఆత్మహత్యకు దారి తీసినట్టు తెలిసింది. వారికి పెళ్లి చేస్తానని చెప్పడం కూడా ఇందుకు ఇక కారణమని పోలీసులు గుర్తించారు.

ఘజియాబాద్‌కు చెందిన ఫారెక్స్ వ్యాపారవేత్త చేతన్‌ కుమార్‌కు ముగ్గురు భార్యలు. వీరికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాకుండా చేతన్ కుమార్‌ సోదరి కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. మొత్తం కుటుంబం అంతా కలిసే ఉంటున్నారు. అయితే, కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో చేతన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ఈ క్రమంలో చేతన్ తన అవసరాల కోసం అప్పులు చేశాడు. అది కాస్తా ఇప్పుడు రెండు కోట్లకు చేరుకుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో.. స్కూల్‌, కాలేజీ ఫీజులు కట్టలేక వారి చదువు ఆగిపోయింది. దీంతో, వారంతో ఇంట్లోనే ఉంటున్నారు.

ఆర్థిక అవసరాల కోసం పేరెంట్స్‌ కూడా పనులు చేసుకుంటున్నారు. దీంతో, పిల్లలు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతన్‌.. పిల్లలను సరిగా పట్టించుకునే వాడు కాదని సమాచారం. ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్‌కు బానిసైపోయారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పాఖి(12).. ‘కొరియన్ లవ్ గేమ్’కు అడిక్ట్‌ అయిపోయారు. సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచారు. గేమ్‌కు బానిసలుగా మారడాన్ని గుర్తించిన తండ్రి.. పది రోజుల క్రితం కుమార్తెల మొబైల్స్‌ను తీసుకుని దాచిపెట్టేశాడు. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయడం, తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వారు ముగ్గురు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు.  ఇంతలోనే కోపంతో ఉన్న తండ్రి పెళ్లిళ్లు చేస్తానని బెదిరించాడు. అయితే తాము భారతీయులం చేసుకోమని.. కొరియన్లనే చేసుకుంటామని తెగేసి చెప్పారు. ఈ విషయాన్ని డైరీలో ముగ్గురు అమ్మాయిలు రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో వారి బాధనంతా డైరీలో వెళ్లగక్కారు. ‘క్షమించండి నాన్న.. నిజంగా క్షమించండి’ అంటూ ఒక సూసైడ్ నోట్‌ ముగ్గురు కూడా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని 9వ అంతస్థులోని బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. కిందనున్న స్థానికులు గమనించి వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)